The First writer 'in-residence' at Rashtrapati Bhavan-Dr Vempalli Gangadhar
The First writer 'in-residence' at Rashtrapati Bhavan -Dr Vempalli Gangadhar డాక్టర్ వేంపల్లి గంగాధర్; రాష్ట్రపతి భవన్లో విశిష్ట ఆతిధ్యం అందుకున్న తొలి భారతీయ సాహిత్య వేత్త గా గుర్తింపు పొందారు. 2014 సెప్టెంబర్ 8వ తేదీ నుంచి 26 వరకు మీరు రాష్ట్రపతి భవన్లో విడిది చేశారు. రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన పలు అంశాలపై పుస్తకాలు రాశారు. వీరి కథా సంపుటి' మొలకల పున్నమి' రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ మొదటి యువ పురస్కారం- 2011 లభించింది. ప్రసిద్ధ సాహిత్యవేత్త సునీల్ గంగోపాధ్యాయ చేతుల మీదుగా తామ్ర పత్రం అందుకున్నారు. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి నుంచి' రాయలసీమ కథా సాహిత్యం' పై పిహెచ్ డి చేసి పట్టా పొందారు. అదే విశ్వవిద్యాలయం నుంచి' రాయలసీమ కక్షల కథల'పై ఎంఫిల్ పరిశోధన చేశారు. కేంద్ర సాహిత్య అకాడమీ వారి రైటర్ ట్రావెల్ గ్రాంట్ ద్వారా శాంతినికేతన్ లో పర్యటించారు . మొలకల పున్నమి, గ్రీష్మ భూమి, దేవరశిల, రావణ వాహనం, పాపాగ్ని కథలు వెలువరించారు. కడప వైభవం, సి.పి. బ్రౌన్ కు మనమేం చేశాం?, అనంతపురం చరిత్ర పుస్తకాలకు సంపాదకత్...
Comments
Post a Comment