గోదాదేవి వస్తోంది...!


ఆలయం లోకి అడుగుపెట్టిన మొదటి భక్తురాలి

అందెల రవళి వినిపిస్తోందా శ్రీ రంగా!
నీ మెడలో వేసిన మల్లె మొల్లల మొనలు
నీ కంఠానికి సుతారంగా గుచ్చుకుంటున్నాయా?
ఏమిరాయమంటావు... అనిరుద్దాయ!
కాటుక కన్నుల గురించా..
కలువల కొలను గురించా..
ఏమి చెప్పమంటావు శ్రీవత్స కౌస్తుభధరాయ !
కర్పూర హారతి గురించా
కస్తూరి పరిమళం గురించా
ఏమి చూడమంటావు శిశుపాల శిరశ్చత్రే!
కుడి చేతి లోని సుదర్శన చక్రమా
పుష్కరిణిలో చక్రస్నానమా
ఎటు వైపు రమ్మంటావు వేణునాధవిశారదాయ !
నందనవనమా... బృందావనమా...
నీ కోసం ఏమి తెమ్మంటావు గీతామృతమహోదయ!
పారిజాతమా... తులసీదళమా ...
ఎటు వెతక మంటావు విభవ విధాయకుడా!
మెరుపు లోనా... మేఘం లోనా...
నా వద్ద ఇంద్ర నీలాలూ... పుష్యరాగాలూ... లేవు.
నేను తెచ్చిన నెమలి పించం నీ కిరీటంలో ధరించి
కాసేపు ఆగు... నీ వేణు గానానికి నీ ముందు నర్తించడానికి
పువ్వులు తలకెత్తుకొని
మువ్వలు ధరించిన గోదాదేవి వస్తోంది...!
© రచన - డాక్టర్ వేంపల్లి గంగాధర్
-----------------------------------------------------------

Comments

Popular posts from this blog

The First writer 'in-residence' at Rashtrapati Bhavan-Dr Vempalli Gangadhar

హార్మోనియం గది

గజ్జెల పిల్లోడు