Posts

Showing posts from 2021

యామయ్యసామి గుర్రం

Image
' యామయ్యసామి గుర్రం ' కథ ద్వారా తెలుగు కథా సాహిత్యం లోకి అడుగుపెట్టాను. 6 జూలై 1997 ఆదివారం ఆంధ్రజ్యోతి లో ఈ కథ ప్రచురితమైంది. ఇదే కథ నా" మొలకల పున్నమి"కథా సంపుటి లోనూ ఉంది. దాదాపు 23 సంవత్సరాల 11 నెలలు క్రితం ప్రచురితమైన ఈ కథ "కథానిలయం" వారి వెబ్సైట్లో ఉంది . ఈ క్రింది లింక్ క్లిక్ చేసి చదవచ్చు. http://kathanilayam.com/story/pdf/35070  

My literature

                                                                                         

బొగ్గుల మనిషి

Image
1 రాత్రి వాన కురిసింది. నేలంతా తడిసిపోయి అక్కడ క్కడా నీళ్లు నిలబడి ఉన్నాయి. బయట దూరంగా సైకిల్ వస్తున్న చెప్పుడు. 'ఎవరు?' కేక వినిపించింది లోపల్నుంచి. 'న్నా! నేను మార్కెట్ సందులో గుడ్డలు ఇస్త్రీ చేసే వెంకటేశు కొడుకును. మా నాయన పంపించినాడు బొగ్గులు కొనుక్కు రమ్మని!' చెప్పినాడు సైకిల్ ఆపి, స్టాండ్ వేస్తూ. 'నిన్ననేకదుబ్బీ..మీ నయనొచ్చి తీసుకపోయింది.అప్పుడే అయిపోయినాయా ... అయినా ఊరంతా విడిచిపెట్టి, ఊరి బయట ఉండే ఈ బట్టీల కాటికే రావాల్నా...' లోగా గదిలోంచి మంచం మీద పడుకునే దీర్ఘం తీసినాడు బొగ్గుల మనిషి. ' ఏమోన్నా! నాకు తెలీదు. రాత్రి వాన కు బొగ్గులన్నీ తడిసిపోయినాయని చెప్పమన్నాడు' చేతి లోకి ప్లాస్టిక్ సంచి తీసుకుంటూ జవాబిచ్చాడు. ' బొగ్గులన్నీ బట్టి వేయకముందే కాంట్రాక్టర్ కు అమ్మేసినాము.దింట్లోయి అమ్మీతే వాడు మొత్తుకొని సస్తాడు.అని తన బాధ చెప్పుకుంటా... ' పదికి, ఇరవైకి అమ్మముబ్బీ. ఇంతకుముందు కూడా మీ నాయనకు చెప్పి నా నే.. మళ్ళా నిన్ను అంపించినాడు ' విసుక్కుంటా బయటికొచ్చినాడు  బొగ్గుల మనిషి. 'ఏమోలేన్నా... ఈసారికి ఇయ్యి!' అని చేతిలోని చిల్లర...

జమీందారి బంగ్లా

Image
  1 గుర్రపు బగ్గీ చెట్టు కింద నీడలో కనిపిస్తోంది. బయటికి వెళ్లే పని లేకుండా ఇవాళ జమీందారు గారు బంగ్లా లోనే ఉంటారు కాబోలు. నౌకర్లు అటు ఇటు గా ఇంటి పనులు చేస్తూ వేగంగా తిరుగుతున్నారు. సిరా బుడ్డీ లో కలాన్ని అద్దుకొని చేవ్రాలు పెట్టిన కాగితాలు పట్టుకొని గుమస్తాలు కార్యాలయంలోని గదిలోకి పరుగులు పెడుతున్నారు. వాతావరణం అంతా హడావిడిగా ఉంది. పట్నం నుంచి నలుగురు కొత్త వ్యక్తులు వచ్చారు. తాము వచ్చిన సంగతి, తమ వివరాలను అక్కడున్న బంట్రోతుకు చెప్పారు. అతను కాసేపు వాళ్లను ఆవరణ లోని చెక్క కుర్చీ ల్లో ఆసీనులు కమ్మని సైగ చేశాడు. వాళ్లు పిలుపు కోసం ఎదురు చూస్తూ ఆ కుర్చీల్లో కూర్చుండిపోయారు. కొంతసేపటి తర్వాత వారికి జమీందారు గారి గదిలోకి అనుమతి లభించింది. తేనీరు కప్పులు లోపలికి వెళ్లాయి. గట్టిగా జమీందారు గారు నవ్విన నవ్వు బయటకు వినిపించింది. వారు ఈరోజు చాలా సంతోషంగా ఉన్నట్లున్నారు. మామూలుగా అయితే వారి కేకలతో బంగ్లా మొత్తం దద్దరిల్లుతుంటుంది . క్షణమొక యుగమై , తుఫాను ముందు ప్రశాంతతను మోస్తూ, నిరంతరం అప్రమత్తమై ఉంటుంది. నౌకర్లు గుండెను అరచేతిలో పెట్టుకొని తిరగడం ఒకటే తక్కువ. బంగ్లాలో పని చేయడం అంటే ఆషామాష...

ఒంటికాలి కాకి

Image
  అప్పుడే క్లాస్ అయిపోయి బయటికొస్తున్నాను. దూరంగా ఇద్దరు పిల్లలు నా వైపుకు పరిగెత్తుకు వస్తున్నారు. 'సార్... సార్.. కుంటి కాకి అక్కడుంది. రండి చూపిస్తాం ' అని గస పెడుతూ చెప్తున్నారు. 'అవునా...' అని దీర్ఘం తీస్తూ ఊ కొడుతూనే 'కుంటి కాకి అనొద్దని ఎన్నిసార్లు చెప్పాలి.' అని చిరాకుపడ్డాను. ' అదే.. అదే.. ఒంటికాలి కాకి ... సార్!' అంటూ తడబడుతూ బదులిచ్చారు పిల్లలు. మొన్న కూడా కొంత మంది పిల్లలు ఇట్లాగే వచ్చి చెప్పారు. ఆ కాకిని చూడ్డానికి ఆసక్తిగా పరుగుపరుగున వెళ్లాను. కానీ అదక్కడ లేదు. ఇప్పుడే అటువైపుకి ఎగిరిపోయిందని చెప్పారు అక్కడున్న పిల్లలు. ' అయ్యో ' అనుకుంటూ వెనక్కి వచ్చేశాను. ఈ మధ్య బడి ఆవరణలో 'ఒంటికాలితో తిరుగుతున్న కాకి ' బాగా కనిపిస్తోందని బడి పిల్లలు తరచూ చెప్తున్నారు . నాకెప్పుడూ అది తారసపడలేదు. దాన్ని చూడాలని నాక్కూడా అనిపిస్తోంది. కానీ ఆ కాకి కనిపించడం లేదు. బడి గోడకు చివర ఉన్న కానుగ చెట్టు వద్ద దాన్ని చూశామని పిల్లలు ఎప్పుడూ చెప్తుంటారు. మధ్యాహ్నం పిల్లలందరూ భోజనం చేశాక, ప్లేట్లు కడుక్కునే చోట అన్నం మెతుకులు తినడం కోసం కూడా వస్తుందని ...

జెయింట్ వీల్

Image
  ఊర్లోకి ఎగ్జిబిషన్ వచ్చింది. వీధుల్లో రిక్షా బండి కి మైకు తగిలించి ప్రచారం చేస్తున్నారు. ఎప్పుడూ టీవీలకు అతుక్కుపోయిన మొహాలు ఇంట్లోనుంచి బయటికి వచ్చి రిక్షా బండి ని తొంగిచూసి వెళ్తున్నాయి. వాడిపోయిన సాయంత్రాలకు జీవం నింపడానికి అప్పుడప్పుడు ఇలాంటి ఎగ్జిబిషన్లు వస్తుంటాయి అనుకుంటాను. నేను కూడా వెళ్లాలి. చూడాలి... కనీసం ఈ సాయంత్రం అయినా వీలు కుదురుతుందో లేదో ! ఆఫీసు మిత్రులతో ఇదే మాట అంటే నవ్వారు. 'చిన్నప్పట్నుంచి ఎన్నిసార్లు వెళ్ళ లేదు. ఇప్పుడు మాత్రం వెళ్లి కొత్తగా చూసేది ఏముంటుంది' అని కొందరన్నారు.' ఆ తిరిగే జెయింట్ వీల్ ను చూస్తూ పెద్ద అప్పలాన్నో, మిరపకాయ బజ్జినో ఆ దుమ్ములో తినడం కోసమా...'అని వెటకారం గా అన్నారు ఇంకొందరు. నా చిన్నప్పుడు మా ఊరిలో జరిగే జాతరకు, తిరునాళ్ళకు, ఉరుసుకు ఒకరోజు ముందే 'రంగులరాట్నం' వచ్చేది. దాన్ని బిగిస్తునప్పుడే బడిలో పిల్లలందరికీ తెలిసిపోయేది. ఇక ఆ తర్వాత సమయం అంతా అక్కడే గడిచిపోయేది. నేను ఎప్పుడు జాతరకు వెళ్ళినా ' రంగులరాట్నం' తప్పనిసరిగా ఎక్కే వాడిని. ఆ తరువాత రంగులరాట్నం ఎప్పుడు మాయమైయిందో తెలియదు. దాని స్థానం లోకి 'జె...

సహదేవుడి వేణువు

Image
  అంతఃపుర స్త్రీలందరూ గుమిగూడారు. రాణివాసం తలుపులు తెరుచుకున్నాయి. 'నువ్వేం చేస్తావో మాకు తెలియదు. మేము కూడా వేణు గానం చేయాలి. ఆ విద్య నువ్వే మాకు నేర్పాలి' అని పట్టుబట్టారు. బృహన్నల బేల చూపులు చూసింది. వేణువు ఊదడం తనెప్పుడూ నేర్చుకోలేదు. రాజగృహ మాలినీమణుల కోరిక తీరేది ఎట్లానో... 'వేణుగానం నాకు రాదు. నన్ను శిక్షణ ఇమ్మని బలవంతం పెట్ట వద్దని' అమాయకంగా ముఖం పెట్టి ప్రాధేయపడింది. కానీ వాళ్ళు వినేటట్టు లేరు. ఇప్పటికిప్పుడు వేణువు పైకి వీళ్లకు మనసు ఎందుకు పోయిందో అంతుబట్టడం లేదు. ' మన దగ్గర, ఈ గదిలో వేణువు కూడా లేదు కదా. మీకు నేర్పించడానికి...' అని తప్పించుకోవాలని చూసింది. ' అదెంత సేపట్లో పని, ఇప్పుడే కబురంపి చిటికెలో తెప్పిస్తాం ' అని అన్నారు వాళ్ళు ఉత్సాహంగా. ఎవరక్కడ? అనగానే వచ్చిన పరిచారిక తో వేగంగా వెళ్లి ఒక వేణువు ను తీసుకొని రమ్మని పురమాయించారు కూడా! 'దేవుడా ...వీళ్లు వదిలేలా లేరు' అని తల పట్టుకుని కూర్చుంది బృహన్నల. ఏదో ఆలోచన మదికి తట్టింది. వెంటనే 'మన రాజ్యంలో బాగా వేణుగానం చేయగలిగిన కళాకారుడిని పిలిపించి అతని ద్వారా ఆ విద్య అందరం నేర్చుకుం...

బైరాగుల బండి

Image
బొగ్గింజన్ తో నడిచే రైలుబండి . దాన్ని చూడడం , అందులో ప్రయాణం చేయడం అప్పట్లో సరదాగా ఉండేది. అందులోని డ్రైవర్లు ఇనుప పారలతో వెనకవైపు ఉన్న బొగ్గును తెచ్చి ఇంజన్ లోకి పోస్తూఉండేవారు. ఆవిరితో కదిలేది. రైలింజనంతా పొగలు కక్కుతూ ఆవిర్లు వెదజల్లుతూ అదో పెద్ద డైనోసార్ లాగా కనిపించేది. ఆ రైలు ఎక్కడమే గానీ ఎప్పుడు దిగుతామో తెలియదు . ఒక స్టేషన్లో ఆగింది అంటే ఎప్పుడు కదులుతుందో తెలియదు. నీలోని ఓపికంతా ఆవిరి అయితే తప్ప ఈ 'ఆవిరింజన్'గమ్యం చేరేది కాదు. అట్లా సాగేది ప్రయాణం. ప్రయాణికులు తిని పారేసిన చెనిక్కాయ పొట్టు ఎక్కడ చూసిన గాలికి ఎగురుతూ ఉండేది. దీని అసలు పేరు లోకల్. కానీ 'బైరాగుల బండి' అని అంటేనే ఎక్కువ మందికి అర్థమయ్యేది. ప్రయాణికులంతా దర్జాగా కూర్చుని ఉండేవారు. ఎవరి దగ్గర టిక్కెట్లు ఉండేవి కాదు. టిక్కెట్ల తనిఖీ అధికారులు అని పిలువబడే 'టీసీలు' కూడా ఎవరూ వచ్చేవారు కాదు. సాధువులు, సన్యాసులు , బైరాగులు రైల్లో ఎక్కడ చూసినా కనిపించే వారు. తంబురా మీటుకుంటూ ఏవేవో జీవిత సత్యాలు తత్వాలు గా పాడుతుండేవారు. 'చిల్లర ఱాళ్లకు మొక్కుచునుంటే.. చిత్తము చెడునుర... ఒరే ఒరే... చిత్తము నందు...