Posts

గోదాదేవి వస్తోంది...!

Image
ఆలయం లోకి అడుగుపెట్టిన మొదటి భక్తురాలి అందెల రవళి వినిపిస్తోందా శ్రీ రంగా! నీ మెడలో వేసిన మల్లె మొల్లల మొనలు నీ కంఠానికి సుతారంగా గుచ్చుకుంటున్నాయా? ఏమిరాయమంటావు... అనిరుద్దాయ! కాటుక కన్నుల గురించా.. కలువల కొలను గురించా.. ఏమి చెప్పమంటావు శ్రీవత్స కౌస్తుభధరాయ ! కర్పూర హారతి గురించా కస్తూరి పరిమళం గురించా ఏమి చూడమంటావు శిశుపాల శిరశ్చత్రే! కుడి చేతి లోని సుదర్శన చక్రమా పుష్కరిణిలో చక్రస్నానమా ఎటు వైపు రమ్మంటావు వేణునాధవిశారదాయ ! నందనవనమా... బృందావనమా... నీ కోసం ఏమి తెమ్మంటావు గీతామృతమహోదయ! పారిజాతమా... తులసీదళమా ... ఎటు వెతక మంటావు విభవ విధాయకుడా! మెరుపు లోనా... మేఘం లోనా... నా వద్ద ఇంద్ర నీలాలూ... పుష్యరాగాలూ... లేవు. నేను తెచ్చిన నెమలి పించం నీ కిరీటంలో ధరించి కాసేపు ఆగు... నీ వేణు గానానికి నీ ముందు నర్తించడానికి పువ్వులు తలకెత్తుకొని మువ్వలు ధరించిన గోదాదేవి వస్తోంది...! © రచన - డాక్టర్ వేంపల్లి గంగాధర్ ----------------------------------------------------------- #తిరుప్పావైపాశురాలు #andal #Telugu

గజ్జెల పిల్లోడు

Image
బడి ఇనుప గేటు తెరుచుకుంది కిర్రు మంటూ శబ్దం చేసుకుంటూ! మరో రెండు అడుగులు చిన్నగా ముందుకేశాడు నరసింహప్ప . అటు వైపు దూరంగా చింత చెట్టు కింద నీడ పరచుకొని జోగుతోంది. దాని పక్కనే బోరింగు కొట్టుకొని నీళ్లు తాగుతున్నారు ఇద్దరు బడి పిల్లలు. ఆయాసపడుతూ ఆ పాత బోరింగు ఆగి ఆగి నీళ్లు కారుస్తోంది. కాసేపటి తర్వాత ఇక నావల్ల కాదన్నట్లు ఆగిపోయింది కూడా. ఉసూరుమంటూ పిల్లల అక్కడి నుంచి వెళ్లి పోతున్నారు. ఎండ నిటారుగా తలపై పడుతోంది. భుజం పైని తుండుగుడ్డ విదిలించుకొని నెత్తికి కప్పుకున్నాడు. దూరంగా తరగతి గదుల్లో పిల్లలు ఎక్కాలు గట్టిగా పలుకుతున్నారు. ఆరవ తరగతి చదివే తన కొడుకు దాసప్ప ఉండే తరగతిగది ఏదో , ఎటు వైపు ఉందో వెతకాలి. బడి ఇప్పుడు మారిపోయింది. కొత్త గదులు వచ్చాయి. ప్రహరీ గోడ కట్టారు. చుట్టూ చెట్లు పచ్చగా కనిపిస్తున్నాయి. 'ఓబ్బీ...మా దాసప్ప యా దిక్కు ఉండేది!' అడిగినాడు ఎదురుగా వస్తున్న పిల్లాడిని. 'ఎన్నవ తరగతిన్నా' ఉన్నట్లుండి అడిగేసరికి నరసింహప్ప కు కొడుకు చదువుతున్న తరగతి ఏదో వెంటనే గుర్తు కు రాలేదు. 'ఏం పేరున్నా' మళ్లీ అడిగాడు ఆ పిల్లవాడు . 'దాసప్ప... దాసప్ప' ఇది మాత్ర...

యామయ్యసామి గుర్రం

Image
' యామయ్యసామి గుర్రం ' కథ ద్వారా తెలుగు కథా సాహిత్యం లోకి అడుగుపెట్టాను. 6 జూలై 1997 ఆదివారం ఆంధ్రజ్యోతి లో ఈ కథ ప్రచురితమైంది. ఇదే కథ నా" మొలకల పున్నమి"కథా సంపుటి లోనూ ఉంది. దాదాపు 23 సంవత్సరాల 11 నెలలు క్రితం ప్రచురితమైన ఈ కథ "కథానిలయం" వారి వెబ్సైట్లో ఉంది . ఈ క్రింది లింక్ క్లిక్ చేసి చదవచ్చు. http://kathanilayam.com/story/pdf/35070  

My literature

                                                                                         

బొగ్గుల మనిషి

Image
1 రాత్రి వాన కురిసింది. నేలంతా తడిసిపోయి అక్కడ క్కడా నీళ్లు నిలబడి ఉన్నాయి. బయట దూరంగా సైకిల్ వస్తున్న చెప్పుడు. 'ఎవరు?' కేక వినిపించింది లోపల్నుంచి. 'న్నా! నేను మార్కెట్ సందులో గుడ్డలు ఇస్త్రీ చేసే వెంకటేశు కొడుకును. మా నాయన పంపించినాడు బొగ్గులు కొనుక్కు రమ్మని!' చెప్పినాడు సైకిల్ ఆపి, స్టాండ్ వేస్తూ. 'నిన్ననేకదుబ్బీ..మీ నయనొచ్చి తీసుకపోయింది.అప్పుడే అయిపోయినాయా ... అయినా ఊరంతా విడిచిపెట్టి, ఊరి బయట ఉండే ఈ బట్టీల కాటికే రావాల్నా...' లోగా గదిలోంచి మంచం మీద పడుకునే దీర్ఘం తీసినాడు బొగ్గుల మనిషి. ' ఏమోన్నా! నాకు తెలీదు. రాత్రి వాన కు బొగ్గులన్నీ తడిసిపోయినాయని చెప్పమన్నాడు' చేతి లోకి ప్లాస్టిక్ సంచి తీసుకుంటూ జవాబిచ్చాడు. ' బొగ్గులన్నీ బట్టి వేయకముందే కాంట్రాక్టర్ కు అమ్మేసినాము.దింట్లోయి అమ్మీతే వాడు మొత్తుకొని సస్తాడు.అని తన బాధ చెప్పుకుంటా... ' పదికి, ఇరవైకి అమ్మముబ్బీ. ఇంతకుముందు కూడా మీ నాయనకు చెప్పి నా నే.. మళ్ళా నిన్ను అంపించినాడు ' విసుక్కుంటా బయటికొచ్చినాడు  బొగ్గుల మనిషి. 'ఏమోలేన్నా... ఈసారికి ఇయ్యి!' అని చేతిలోని చిల్లర...

జమీందారి బంగ్లా

Image
  1 గుర్రపు బగ్గీ చెట్టు కింద నీడలో కనిపిస్తోంది. బయటికి వెళ్లే పని లేకుండా ఇవాళ జమీందారు గారు బంగ్లా లోనే ఉంటారు కాబోలు. నౌకర్లు అటు ఇటు గా ఇంటి పనులు చేస్తూ వేగంగా తిరుగుతున్నారు. సిరా బుడ్డీ లో కలాన్ని అద్దుకొని చేవ్రాలు పెట్టిన కాగితాలు పట్టుకొని గుమస్తాలు కార్యాలయంలోని గదిలోకి పరుగులు పెడుతున్నారు. వాతావరణం అంతా హడావిడిగా ఉంది. పట్నం నుంచి నలుగురు కొత్త వ్యక్తులు వచ్చారు. తాము వచ్చిన సంగతి, తమ వివరాలను అక్కడున్న బంట్రోతుకు చెప్పారు. అతను కాసేపు వాళ్లను ఆవరణ లోని చెక్క కుర్చీ ల్లో ఆసీనులు కమ్మని సైగ చేశాడు. వాళ్లు పిలుపు కోసం ఎదురు చూస్తూ ఆ కుర్చీల్లో కూర్చుండిపోయారు. కొంతసేపటి తర్వాత వారికి జమీందారు గారి గదిలోకి అనుమతి లభించింది. తేనీరు కప్పులు లోపలికి వెళ్లాయి. గట్టిగా జమీందారు గారు నవ్విన నవ్వు బయటకు వినిపించింది. వారు ఈరోజు చాలా సంతోషంగా ఉన్నట్లున్నారు. మామూలుగా అయితే వారి కేకలతో బంగ్లా మొత్తం దద్దరిల్లుతుంటుంది . క్షణమొక యుగమై , తుఫాను ముందు ప్రశాంతతను మోస్తూ, నిరంతరం అప్రమత్తమై ఉంటుంది. నౌకర్లు గుండెను అరచేతిలో పెట్టుకొని తిరగడం ఒకటే తక్కువ. బంగ్లాలో పని చేయడం అంటే ఆషామాష...