Posts

Showing posts from October, 2024

హార్మోనియం గది

Image
వేప చెట్టు కొమ్మల్లో ఉన్న గూళ్ళ వద్దకు ఒక్కొక్కటిగా పక్షులు చేరుకుంటున్నాయి. కొన్ని ఆగి ఆగి అరుస్తున్నాయి. సూర్యుడు పడమటి కొండల్లోకి ఆవలించుకుంటూ దిగి పోతున్నాడు. ఇదే సందులో రెండిళ్ళ అవతల ఉంది పాత మట్టి మిద్దె. కాసేపటికి పాత చెక్కల తలుపు కిర్రు మంటూ తెరుచుకుంది. లాంతరు వెలిగించి బయట వసారాకు ఉన్న ఇనుప కొక్కి కి తగిలించారు. ఇంకా ఎవరు రాలేదు. గది గోడలకు కొట్టిన సున్నం మొన్న కురిసిన వానలకు వెలసి పోయి ఎర్ర చారలతో రంగు బారింది. అక్కడక్కడ మట్టి గోడ పెచ్చులు ఊడిపోయి కనిపిస్తోంది. బయట ఆకాశంలో నల్ల మోడాలు కమ్ముకుంటున్నాయి. వాన పడుతుందో లేదో తెలియదు. గదిలోకి తొంగి చూస్తే నిశ్శబ్దం. ఒకవైపు గంభీరంగా నిలబడి ఎవరికోసమో ఎదురుచూస్తున్నట్లు ఉంది హార్మోనియం. దానిపైన గుడ్డ కప్పి ఉంది. మరోవైపు తబలాలు గూట్లో పరదా వెనుక తమను వాయించే రెండు చేతుల కోసం నిరీక్షిస్తున్నాయి. మామూలుగా అయితే ఈ పాటికి బృందం వచ్చేది. చీకటి పడుతోంది. గది తలుపు తెరిచి, లాంతరు వెలిగించిన ఆడమనిషి చీపురుతో గదిని శుభ్రం చేసి అక్కడే అరుగుపైన కూర్చొని చూస్తోంది. దూరంగా శబ్దం కిర్రు చెప్పుల శబ్దం వినిపిస్తోంది. అవును అది గురువులయ్య దే. పేరు గంగ...