Posts

Showing posts from 2023

నీలి కళ్ళ పిల్ల

Image
ఈ రోజు గురువారం. బడి దగ్గర సంత జరుగుతుంది. నిజానికి ప్రతివారం సంతకు వెళ్ళవలసిన అవసరం నాకు ఉండదు. కానీ ఈమధ్య తరచూ వెళ్తున్నాను.  కొండకు అవతల ఉన్న అడవి పల్లె నుంచి నెత్తిన చిన్న గంప నెత్తుకొని వాళ్ళ అమ్మ తో పాటు ఆ చిన్ని ' నీలి కళ్ళ పిల్ల ' వస్తుంది. ఆ గంప లో ఏమి ఉండవు. ఒక్కొక్కసారి కొన్ని ఉసిరికాయలు మాత్రం ఉంటాయి. చాలా ముద్దు ముద్దుగా మాట్లాడుతుంది. చాక్లెట్లు ఇస్తే తీసుకోవాలా, వద్దా అన్నట్లు వాళ్ళ అమ్మ వైపు చూస్తూ చేయి చాస్తుంది. వాళ్ళ అమ్మ ఏమో 'తీసుకో ఏమి పరవాలేదు... మనసారే' అన్నట్లు చెబుతుంది. ఈ చిన్న అమ్మాయి అటు ఇటు చూస్తూ టక్కు మని నా చేతిలోని చాక్లెట్ లాగేసుకుంటుంది. నాకు చాలా సరదాగా ఉంటుంది. అంతకుమునుపు సంతకు వెళ్లాలంటే చిరాకుగా ఉండేది. కానీ ఈ పిల్ల పరిచయమయ్యాక తరచూ వెళ్లాలని పిస్తోంది. నిజానికి ఈ చిన్నమ్మాయి నాకెందుకు నచ్చిందా? అని నాకు నేను ఒకసారి ఆలోచించాను. అప్పుడు నాకు అర్థమైంది ఏమిటంటే ఆ పిల్ల ' నీలి  కళ్ళు' నన్ను ఆకట్టుకున్నాయి అని . ఈ నీలి కళ్ళనే చాలామంది, చాలాచోట్ల సహజంగా నో  , హేళన గా నో  'పిల్లి కళ్ళు' అని అంటూ ఉండడం విన్నాను.  కానీ  ఇంద...

గోదాదేవి వస్తోంది...!

Image
ఆలయం లోకి అడుగుపెట్టిన మొదటి భక్తురాలి అందెల రవళి వినిపిస్తోందా శ్రీ రంగా! నీ మెడలో వేసిన మల్లె మొల్లల మొనలు నీ కంఠానికి సుతారంగా గుచ్చుకుంటున్నాయా? ఏమిరాయమంటావు... అనిరుద్దాయ! కాటుక కన్నుల గురించా.. కలువల కొలను గురించా.. ఏమి చెప్పమంటావు శ్రీవత్స కౌస్తుభధరాయ ! కర్పూర హారతి గురించా కస్తూరి పరిమళం గురించా ఏమి చూడమంటావు శిశుపాల శిరశ్చత్రే! కుడి చేతి లోని సుదర్శన చక్రమా పుష్కరిణిలో చక్రస్నానమా ఎటు వైపు రమ్మంటావు వేణునాధవిశారదాయ ! నందనవనమా... బృందావనమా... నీ కోసం ఏమి తెమ్మంటావు గీతామృతమహోదయ! పారిజాతమా... తులసీదళమా ... ఎటు వెతక మంటావు విభవ విధాయకుడా! మెరుపు లోనా... మేఘం లోనా... నా వద్ద ఇంద్ర నీలాలూ... పుష్యరాగాలూ... లేవు. నేను తెచ్చిన నెమలి పించం నీ కిరీటంలో ధరించి కాసేపు ఆగు... నీ వేణు గానానికి నీ ముందు నర్తించడానికి పువ్వులు తలకెత్తుకొని మువ్వలు ధరించిన గోదాదేవి వస్తోంది...! © రచన - డాక్టర్ వేంపల్లి గంగాధర్ ----------------------------------------------------------- #తిరుప్పావైపాశురాలు #andal #Telugu