Posts

Showing posts from July, 2022

గజ్జెల పిల్లోడు

Image
బడి ఇనుప గేటు తెరుచుకుంది కిర్రు మంటూ శబ్దం చేసుకుంటూ! మరో రెండు అడుగులు చిన్నగా ముందుకేశాడు నరసింహప్ప . అటు వైపు దూరంగా చింత చెట్టు కింద నీడ పరచుకొని జోగుతోంది. దాని పక్కనే బోరింగు కొట్టుకొని నీళ్లు తాగుతున్నారు ఇద్దరు బడి పిల్లలు. ఆయాసపడుతూ ఆ పాత బోరింగు ఆగి ఆగి నీళ్లు కారుస్తోంది. కాసేపటి తర్వాత ఇక నావల్ల కాదన్నట్లు ఆగిపోయింది కూడా. ఉసూరుమంటూ పిల్లల అక్కడి నుంచి వెళ్లి పోతున్నారు. ఎండ నిటారుగా తలపై పడుతోంది. భుజం పైని తుండుగుడ్డ విదిలించుకొని నెత్తికి కప్పుకున్నాడు. దూరంగా తరగతి గదుల్లో పిల్లలు ఎక్కాలు గట్టిగా పలుకుతున్నారు. ఆరవ తరగతి చదివే తన కొడుకు దాసప్ప ఉండే తరగతిగది ఏదో , ఎటు వైపు ఉందో వెతకాలి. బడి ఇప్పుడు మారిపోయింది. కొత్త గదులు వచ్చాయి. ప్రహరీ గోడ కట్టారు. చుట్టూ చెట్లు పచ్చగా కనిపిస్తున్నాయి. 'ఓబ్బీ...మా దాసప్ప యా దిక్కు ఉండేది!' అడిగినాడు ఎదురుగా వస్తున్న పిల్లాడిని. 'ఎన్నవ తరగతిన్నా' ఉన్నట్లుండి అడిగేసరికి నరసింహప్ప కు కొడుకు చదువుతున్న తరగతి ఏదో వెంటనే గుర్తు కు రాలేదు. 'ఏం పేరున్నా' మళ్లీ అడిగాడు ఆ పిల్లవాడు . 'దాసప్ప... దాసప్ప' ఇది మాత్ర...