Posts

Showing posts from July, 2025
Image
గాలి బాగా వీస్తోంది.. వర్షం పడుతుందంటావా? మ్మా ! ఏమోరా తెలియదు చూస్తుంటే పడేటట్టుగానే ఉంది ఆకాశం లో నల్లటి మబ్బులు మన కొండ పల్లె వైపే కదిలిపోతున్నాయి. త్వరగా నడువు ఇంటికి వెళ్దాం.. మరి అంత గట్టిగా భుజాన్ని గుంజకుమ్మా నీతో పాటూ నడవలేకున్నాను. కాస్త నెమ్మదిగా కదులు. నీ మాట వింటే ఇక్కడే తడిసి ముద్దయిపోతాము. చూడు అప్పుడే చిన్నగా చినుకులు పడుతున్నాయి. త్వరగా నడు! కాసేపు ఆగమ్మా ఈ చెట్టు కిందైన! ఏమి? ఎందుకు? ఏంటి తెస్తున్నావు నీ జేబులో పెట్టుకుని.. చూపించు ! బెరుకు బెరుకుగా కళ్ళల్లోకి చూస్తూ తన లేత చేతుల్లో ఉన్న కాగితం పడవ ను చూపాడు. వాన వేగం పెరిగింది. ఆగిపోయారు అక్కడే! రచన : డాక్టర్ వేంపల్లి గంగాధర్ by Vempalli Gangadhar Photo @ Windswept, 1929, Josef Vetrovsky.