బొగ్గుల మనిషి

1 రాత్రి వాన కురిసింది. నేలంతా తడిసిపోయి అక్కడ క్కడా నీళ్లు నిలబడి ఉన్నాయి. బయట దూరంగా సైకిల్ వస్తున్న చెప్పుడు. 'ఎవరు?' కేక వినిపించింది లోపల్నుంచి. 'న్నా! నేను మార్కెట్ సందులో గుడ్డలు ఇస్త్రీ చేసే వెంకటేశు కొడుకును. మా నాయన పంపించినాడు బొగ్గులు కొనుక్కు రమ్మని!' చెప్పినాడు సైకిల్ ఆపి, స్టాండ్ వేస్తూ. 'నిన్ననేకదుబ్బీ..మీ నయనొచ్చి తీసుకపోయింది.అప్పుడే అయిపోయినాయా ... అయినా ఊరంతా విడిచిపెట్టి, ఊరి బయట ఉండే ఈ బట్టీల కాటికే రావాల్నా...' లోగా గదిలోంచి మంచం మీద పడుకునే దీర్ఘం తీసినాడు బొగ్గుల మనిషి. ' ఏమోన్నా! నాకు తెలీదు. రాత్రి వాన కు బొగ్గులన్నీ తడిసిపోయినాయని చెప్పమన్నాడు' చేతి లోకి ప్లాస్టిక్ సంచి తీసుకుంటూ జవాబిచ్చాడు. ' బొగ్గులన్నీ బట్టి వేయకముందే కాంట్రాక్టర్ కు అమ్మేసినాము.దింట్లోయి అమ్మీతే వాడు మొత్తుకొని సస్తాడు.అని తన బాధ చెప్పుకుంటా... ' పదికి, ఇరవైకి అమ్మముబ్బీ. ఇంతకుముందు కూడా మీ నాయనకు చెప్పి నా నే.. మళ్ళా నిన్ను అంపించినాడు ' విసుక్కుంటా బయటికొచ్చినాడు బొగ్గుల మనిషి. 'ఏమోలేన్నా... ఈసారికి ఇయ్యి!' అని చేతిలోని చిల్లర...